SNAPDEAL

Thursday 26 November 2015

ఎవరు మారాలి? ఎందుకు మారాలి?? మార్పు ఎక్కడ రావాలి???


ఎవరు మారాలి? ఎందుకు మారాలి?? మార్పు ఎక్కడ రావాలి???
 ఎవరు మారాలి? ఎందుకు మారాలి? మార్పు ఎక్కడి నుండి రావాలి? 
ఎవడు? ఎవడు? మారాలి
మారాలి, మారాలి అంటాం.ఎవరు ముందు మారాల్సింది?
మనకు వ్యాయామం చేయకుండానే బరువు తగ్గాలి.
కష్టపడకుండానే ఫలితం రావాలి.
మందు, మాంసం తినాలి కానీ ఆరోగ్యం బాగుండాలి.
పొగ త్రాగాలి కానీ క్యాన్సర్ రాకూడదు.
పొద్దునలేచి అరగంట వ్యాయామం చేయడం చేతకాదు కానీ 60 ఏళ్ళదాకా యవ్వనంగా ఉండాలి.
ఓటు వేయడం చేతకాదు కానీ దేశం మారిపోవాలి.
తిరగబడే దమ్ములేదు కానీ అవినీతి అంతమవ్వాలి.
కాలుష్యం పెరుగుతుందని విసుక్కుంటాం కానీ పుట్టిన రోజు నాడైన ఒక మొక్కలను నాటం.
లంచగొండితనం హద్దులు మీరుతుందని మధనపడతాం,
అవసరమైనప్పుడు అదే లంచమిచ్చి పని చేయించుకుంటాం,
అవకాశం దొరికితే అదే లంచం పుచ్చుకుంటాం.
సమాజంలో స్వార్ధం పెరుగిందని ఆక్రోశిస్తాం కానీ కొత్త కరెన్సీ నోట్లను పర్సులో, బీరువాలో దాచుకుంటం.
పౌరహక్కుల గురించి అనర్గళంగా మాట్లాడుతుంటం కానీ కళ్ళ ముందు క్రైమ్ జరిగిన సాక్షం చెప్పడానికి భయపడి చస్తాం.
అన్నం మనం తినాలి కానీ పొట్ట వేరేవారికి పెరగాలి.
మనం చికెన్ కూడా త్యాగం చేయం కానీ మన నాయకులు గాంధేయవాదులుగా ఉండాలి.
మన నాయకులు వ్యాయామం చేయాలి కానీ మనకు పొట్ట తగ్గాలి.
మనం మన భార్య పిల్లలతో ఇంట్లో సంతోషంగా ఉండాలి కానీ మన నాయకులు మన కోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉండాలి.
ఇప్పుడు చెప్పు, ఎవరు ముందు మారాలి?
స్వార్ధం ఎవరు విడిచిపెట్టాలి?

https://www.facebook.com/groups/1606693429583023/